ధాన్య కొనుగోలు వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 7: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ధాన్య కొనుగోళ్ళు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్య కొనుగోలు పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికి 31 వేయి 974 మంది రైతుల నుండి లక్షా 87 వేల 147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు ధాన్యంలో లక్షా 78 వేల 859 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల నుండి గోడౌన్లకు తరలించామన్నారు. మిగులు ధాన్యాన్ని వెంటనే తరలింపుకు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ఎక్కువ జరుగుతున్న కేంద్రాలకు రవాణా వెంట వెంటనే జరిగేలా అదనపు వాహనాలు పంపాలన్నారు. రూ. 366 కోట్ల 81 లక్షల విలువ గల ధాన్యం ఇప్పటికి కొనుగోలు చేయగా, 18 వేల 315 మంది రైతులకు రూ. 207 కోట్ల 56 లక్షలు వారి వారి ఖాతాల్లో జమచేసామన్నారు. 23 వేల 311 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగులు రైతుల, ట్రక్ షీట్ల వివరాలు ఆన్లైన్ నమోదు త్వరితగతిన పూర్తి చేసి, ధాన్యం డబ్బులు రైతులకు త్వరగా అందునట్లు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అధికారులు సమన్వయంతో ధాన్య కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరిక్రిష్ణ, డిఆర్డీఓ కె. కౌటిల్య, డిటివో కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post