ధాన్య రవాణా వెంట వెంటనే జరగాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16: ధాన్య కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్య కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలను అనుమతులు ఇవ్వగా, మంగళవారం నాటికి 252 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. 227 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే జరిగినట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 7 వేల 987 మంది రైతుల నుండి 101 కోట్ల 83 లక్షల రూపాయల విలువ గల 51 వేయి 952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్య రవాణాకు రవాణా కాంట్రాక్టర్ల నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద వాహనాలు సిద్ధంగా ఉండాలని, అవసరమున్న చోట మరిన్ని వాహనాలు తరలించడానికి అదనంగా వాహనాలు సిద్ధపర్చాలన్నారు. ఆన్లోడింగ్ లో జాప్యతను నివారించాలని ఆయన తెలిపారు. సమన్వయంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సహాయం, సమస్యలు, ఫిర్యాదులు తెలపడానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి సహాయం, సమస్యలు, ఫిర్యాదులను తెలియజేయడానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులకు తమ ధాన్యం విక్రయించడంలో ఏవైనా సమస్యలు ఎదురైనా, ఇతర ఫిర్యాదులను తెలపడానికి కలెక్టరేట్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన 6303928692, 9398684240 అనే నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె.కౌటిల్య, డీసీఓ బుద్ధనాయుడు, డీటీఓ కొండల్ రావు, ఏఓ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post