మహబూబాబాద్, ఏప్రిల్ -27:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ధూప, దీప, నైవేద్య అర్చక దరఖాస్తుల గడువు ఈ నెల 27తో ముగిసినందున వివిధ అర్చక సంఘాల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువు మే 20 వరకు పొడిగించినట్లు జిల్లా దేవాదాయశాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎన్. కవిత నెడోక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తులను వెబ్ సైట్ www.endowments.ts.nic.in నుండి డౌన్ లోడ్ చేసుకొని పూర్తిచేసి సహాయ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని వారు కోరారు.