ధృడ సంకల్పం ఉంటేనే ఉద్యోగ సాధన సులువే!- SI, CONSTABLE ఈవెంట్ లకు సన్నద్ధం అవుతున్న యువతకు జిల్లా అదనపు కలెక్టర్ కర్తవ్యబోధ

 

ధృడ సంకల్పం ఉంటేనే ఉద్యోగ సాధన సులువే!

– జీవిత లక్ష్యాన్ని చేరాలంటే ప్రణాళిక బద్దకృషి అవసరం

– అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు

– నిరాశ దరిచేరనీయ వద్దు. లక్ష్య సాధనలో ఇసుమంతైనా అశ్రద్ద వద్దు

– సామర్థ్యం తో పాటు శిక్షకులు చెప్పే టెక్నిక్ లపై దృష్టి పెట్టండి

– SI, CONSTABLE ఈవెంట్ లకు సన్నద్ధం అవుతున్న యువతకు జిల్లా అదనపు కలెక్టర్ కర్తవ్యబోధ

——————————-

కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలలో తొలి మెట్టు లో విజయం సాధించారు….
అదే స్ఫూర్తి తో రెండో తంతె ఈవెంట్స్, తుది మెట్టు రాత పరీక్షలో నెగ్గి ఉద్యోగం సాధించే దాకా విశ్రమించవద్దని వద్దని ఎస్సై కానిస్టేబుల్ ఈవెంట్లకు సన్నద్ధమవుతున్న యువతకు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కర్తవ్యబోధ చేశారు.

ప్రణాళిక బద్ద కృషి, ధృడ సంకల్పం ఉంటే సులవుగా ఉద్యోగాన్ని చెజిక్కిoచుకోవచ్చునని అన్నారు.

సిరిసిల్ల పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణ లో SI, CONSTABLE ఈవెంట్ లకు సన్నద్ధం అవుతున్న యువతకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

అదనపు కలెక్టర్ జావెలిన్ త్రో వేసి యువత లో ఉత్సహo నింపారు.

అనంతరం శిక్షణ పొందుతున్న యువతలో స్ఫూర్తి నింపేలా జిల్లా కలెక్టర్ ప్రసంగించారు.
జీవిత లక్ష్యాన్ని చేరాలంటే ప్రణాళిక బద్దకృషి అవసరమన్నారు.
అందివచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యువత చేజార్చుకోవద్దన్నారు.
నిరాశ దరిచేరనీయ వద్దు. లక్ష్య సాధనలో ఇసుమంతైనా అశ్రద్ద ఉండోద్దని అన్నారు.
సామర్థ్యం తో పాటు శిక్షకులు చెప్పే టెక్నిక్ లపై దృష్టి పెడితే సులువుగా విజయం సాధించవచ్చునని తెలిపారు.
లక్ష్య సాధనలో విజయం సాధించి తమ తల్లిదండ్రుల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని యువత నిలబెట్టాలని పేర్కొన్నారు.

——————————

Share This Post