ధైర్యసాహసాలతో సైకిల్ యాత్రలో పాల్గొంటున్న అధికారిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి ఎం రాజేష్ చంద్ర.

సెప్టెంబర్ 12, 2021ఆదిలాబాదు:-

మదినిండా దేశభక్తి, అడ్డంకి కానీ వైకల్యం. సిఆర్పిఎఫ్ అధికారి అంగవైకల్యంతో 2800 కి, మీ. చేపట్టిన సైకిల్ యాత్ర. ధైర్యసాహసాలతో సైకిల్ యాత్రలో పాల్గొంటున్న అధికారిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి ఎం రాజేష్ చంద్ర.

కృత్రిమ కాలు సహాయంతో సైకిల్ తొక్కుతున్న వ్యక్తి పేరు అజయ్ కుమార్ సింగ్, బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయన సిఆర్పిఎఫ్ కీలకమైన అధికారి, 2014 ఈ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చత్తీస్ గడ్ రాష్ట్రంలో బందోబస్తు విధుల్లో ఉండగా జరిగిన బాంబు పేలుడులో ఎడమ కాలు తొడ భాగం వరకు పూర్తిగా కోల్పోయారు, అయినా ధైర్యస్థైర్యాలను కోల్పోకుండా కృత్రిమ కాలు సహాయంతోనే విధుల్లో కొనసాగుతున్నారు, ప్రస్తుతం సిఆర్పిఎఫ్ కి చెందిన ఎన్ సిడిఈ (నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ హైదరాబాద్) దివ్యాంగుల విభాగంలో ఇన్స్ పెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు, బాంబు పేలుడు ప్రమాదం తర్వాత ఏమాత్రం కుంగిపోకుండా, జీవితంలో ఏదైనా ప్రత్యేకంగా సాధించాలనిపించింది. అందుకే ఎంతో సవాలుతో కూడిన సైకిల్ యాత్రను ఎంచుకున్నారు, ఆయన గతంలో అనేకసార్లు బృందంతో కలిసి 2016 నుంచి అటారీ-ఢిల్లీ, సిమ్లా-మనాలి, సబర్మతి-ఢిల్లీ, ఢిల్లీ-ముంబాయి, హైదరాబాద్-తిరుపతి, దేహ్రా దూన్, మన్నాపాడ్ (బద్రీనాథ్) వరకు ఇప్పటికే ఆరు సార్లు వేలాది కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు, ప్రస్తుతం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ (రాజ్ ఘాట్) 2800 కిలోమీటర్లు మధ్య చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు, కాగా వీరి యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగి రాత్రి స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో బసచేసి సోమవారం ఉదయం జాతీయ రహదారి గుండా మహారాష్ట్ర రాష్ట్రంలో విజయవంతంగా ప్రవేశించనున్నారు, విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అధికారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆయన ధైర్యసాహసాలను మెచ్చుకొని ప్రత్యేకంగా అభినందించారు, మరిన్ని సాహసాలు చేపట్టి దేశ ప్రతిష్టల కీర్తిని నలుదిశలా వ్యాపించే విధంగా స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post