నంగనూరు మండలంలోని సిద్దన్నపేటలో మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు


నంగనూరు మండలంలోని సిద్దన్నపేటలో మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పంపించేశారు.

మంత్రి హరీష్ రావు కామెంట్స్ :-

* పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్ళి భారం కాకూడదని ఒక లక్ష 116 రూపాయల కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా సహాయం చేకూర్చడం జరుగుతుంది.
* డబ్బులు దుర్వినియోగం కాకూడదని ఉద్దేశంతో పెళ్లికూతురు తల్లి పేరు మీద చెక్కు ఇవ్వడం జరుగుతుంది.
*డబ్బులను సద్వినియోగం చేసుకోవాలి.
* ప్రభుత్వ ఆసుపతృలలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందున ప్రసూతి సేవల కోసం కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉపయోగించాలి.
* గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవమై ఇంటికి తల్లి, బిడ్డ క్షేమంగా చేరేవరకు ప్రభుత్వం అన్ని స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్త తీసుకుంటుంది.
* ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే 12 వేల రూపాయలు మరియు కేసిఆర్ కిట్టు అందించడం జరుగుతుంది.
* ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నందున డబ్బులను వృధా చేసుకొని ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దు.
issued by Dist public Relations office siddipet

Share This Post