*నందికొండ మున్సిపాలిటీ పరిధి లో అక్రమ కట్టడాలు కూల్చివేత*

 *నందికొండ మున్సిపాలిటీ పరిధి లో అక్రమ కట్టడాలు కూల్చివేత*                 *అక్రమ కట్టడాలు పై పొరులు జిల్లా టాస్క్ ఫోర్స్,మున్సిపాలిటీ అధికారులకు పౌరులు సమాచారం అందించవచ్చు,అన్ని మున్సిపాలిటీ లలో అక్రమ కట్టడాలపై స్పెషల్ డ్రైవ్:స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ*                         నందికొండ,అక్టోబర్ 25.నందికొండ మునిసిపాలిటి పరిధి లో అక్రమ కట్టడాలు పై జిల్లా టాస్క్ ఫోర్స్,మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్రమ కట్టడాలను కూల్చి వేశారు.నందికొండ మున్సిపాలిటీ లో అక్రమ కట్టడాలు పెరగడం వలన  అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)  రాహుల్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF)అద్వర్యం సోమవారం మున్సిపాలి లో అక్రమ కట్టడాలు 14 గుర్తించి  చర్యలు తీసుకున్నారు.జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లో (డిటిఎఫ్) లో ప్రదానంగా CI,SI,రెవిన్యూ శాఖ నుంచి RI,ఫైరింగ్ స్టేషన్ ఆఫీసర్ ,పట్టణ ప్రణాళిక అధికారి, మునిసిపాలిటి సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ  మాట్లాడుతూ పౌరులు ఎవరైనా అక్రమ కట్టడాల పై సమాచారం ఉంటే జిల్లా టాస్క్ ఫోర్స్,మున్సిపల్ అధికారులకు తెలపాలని  విజ్ఞప్తి చేశారు.అన్ని మున్సిపాలిటీ లలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లు ఏర్పాటు చేసినట్లు, అక్రమ కట్టడాల కూల్చివెతలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

Share This Post