నకిరేకల్,జనవరి 11. నకిరేకల్ ఎం.పి.డి. ఓ కార్యాలయ కాంప్లెక్స్ లో నిర్మాణం చేయనున్న సమీకృత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.

*పత్రికా ప్రకటన*            నకిరేకల్,జనవరి 11. నకిరేకల్ ఎం.పి.డి. ఓ కార్యాలయ కాంప్లెక్స్ లో నిర్మాణం చేయనున్న సమీకృత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.ప్రస్తుతం కాంప్లెక్స్ లో పంచాయతి రాజ్ డి.ఈ., వెటర్నరీ ఏరియా ఆసుపత్రి,ఎం.ఆర్.సి భవనం,గ్రంధాలయం,విద్యుత్ శాఖ కార్యాలయం,జడ్.పి.గెస్ట్ హౌజ్,షట్టర్ లు ఉన్నాయి.వెటర్నరీ ఏరియా ఆసుపత్రి, పంచాయతీ రాజ్ డి.ఈ., ఎం.ఆర్.సి. కార్యాలయం లు ఎం.పి.డి.ఓ.కార్యాలయం దగ్గర ఉన్న స్త్రీ శక్తి భవన్ లోకి తాత్కాలికంగా షిఫ్ట్ చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.గ్రంధాలయం,విద్యుత్ కార్యాలయం షిప్టింగ్ పై కూడా కలెక్టర్ అధికారులతో చర్చించారు.జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ బాలాజీ,పంచాయతీ రాజ్ ఈ ఈ. తిరుపతయ్య,డి.ఈ. ఓ.భిక్షపతి,ఎం.పి.డి.ఓ.వెంకటేశ్వర్ రావు, ఎం.ఆర్.ఓ.ప్రతాప్ నాయక్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post