నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్తో కలిసి శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 25 ఖమ్మం: –

ఖమ్మం నగరం టేకులపల్లిలోని కె.సి.ఆర్ టవర్స్ డుబల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు దసరా రోజున జరపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ వి.పి. వి.పి. గౌతమ్ శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. మొత్తం 52 బ్లాక్ లకు గాను ఇప్పటికే అన్ని సౌకర్యాలతో పూర్తయిన 42 బ్లాక్ల లబ్దిదారులు ఎంపిక పూర్తయిందని, అట్టి 1004 మంది లబ్ధిదారులకు కేటాయించిన గృహాలలో దసరా రోజున గృహప్రవేశాలు. చేయించేందుకు నిర్ణయించామని, తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనితోపాటు మిగిలిన 10 బ్లాక్ ల ముగింపు పనులు కూడా త్వరగా పూర్తి చేసి దీపావళి నాడు. అట్టి గృహప్రవేశాలు జరిగేలా సిద్ధంగా ఉంచాలని అధికారులను, గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే అన్ని వసతులతో పూర్తి చేసుకున్న గృహ సముదాయాలలో షాపింగ్ కాంప్లెక్స్, మెడికల్ సబ్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లను కూడా ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన 10 బ్లాక్ లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను కూడా త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ప్రకాష్ర్  నగ ర్ వంతెన వద్ద కొనసాగుతున్న గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ ముగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం జరిగితే బాధ్యులపై తగు చర్యలుంటాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మిగిలిన పైప్ లైన్ ఎస్.టి.పి. చైన్ లింక్  ఫెన్సింగ్ డ్రైన్ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్. బచ్చు విజయకుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్.డి.ఓ. రవీంద్రనాథ్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్.ఇ. రమేష్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, అర్బన్ తహశీల్దారు శైలజ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post