నగరంలో అమృత్ పథకం కింద జరుగుతున్న మిషన్ భగీరథ ముగింపు పనులను యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను, ఏజెన్సీ బాధ్యులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 01 ఖమ్మం:–

నగరంలో అమృత్ పథకం కింద జరుగుతున్న మిషన్ భగీరథ ముగింపు పనులను యుద్ధ ప్రాతిపదిక న పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను, ఏజెన్సీ బాధ్యులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఎల్.అండ్.టి ఏజెన్సీ బాధ్యులతో అమృత్ పథకం మిషన్ భగీరథ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరాకై చేపట్టిన మిషన్ భగీరథ పనులలో 18 ట్యాంకులకు గాను 6 ట్యాంకులు మాత్రమే పూర్తి స్థాయిలోకి వచ్చాయని మిగిలిన 12 ట్యాంకుల పనులను మరింత వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు పైప్ లైన్ లీకేజ్ పనులను సత్వరమే చేపట్టాలని, ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజ్లు ఉండరాదని పబ్లిక్ హెల్త్, నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని, పనుల పురోగతి నివేదికను ప్రతి వారం సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేవిధంగా ఏజెన్సీకు ప్రతి వారం లక్ష్యాన్ని నిర్దేశించి పనుల పురోగతిపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీరు అంజనేయప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రంజిత్ కుమార్, మున్సిపల్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కృష్ణలాల్, డి. ఇలు రంగారావు, శ్రీనివాసరావు, ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రాజెక్టు మేనేజర్ హరిప్రసాద్, సాంకేతిక సిబ్బంది తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post