ప్రచురణార్ధం
డిశంబరు 30, ఖమ్మం
నగరంలో ఏర్పాటు చేసుకున్న లకారం మినీ ట్యాంక్ బండ్ తరహాలో నియోజకవర్గంలో అనువుగా ఉన్న చెరువులన్నింటిని మినిట్యాంక్ బండ్లుగా ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించండం జరుగుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న మిని ట్యాంక్ : బండ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ నగరంలో నిర్మించిన లకారం మినీ ట్యాంక్ బండ్ తరహాలో వేపకుంట్ల గ్రామం ఊరచెరువును అభివృద్ధి పర్చాలని, అధికారులు, ప్రజాప్రతినిధుల సహాకారంతో త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, సర్పంచ్ ధారా శ్యామ్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరు శంకర్‌నాయక్, ఆర్.డి.ఓ రవీంద్రనాద్, తహశీల్దారు నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.