నగరంలో చేపట్టే రోడ్ల అభివృద్ధి పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నగరపాలక సంస్థ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 12 ఖమ్మం:

నగరంలో చేపట్టే రోడ్ల అభివృద్ధి పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నగరపాలక సంస్థ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. నగరంలోని 13, 14 వ డివిజన్ నందు 90 లక్షల రూపాయల వ్యయంతో చేపడ్తున్న బి.టి రోడ్డు విస్తరణ పనులకు అదేవిధంగా 7వ డివిజన్ నందు టేకులపల్లి బ్రిడ్జి నుండి ఖానాపురం వరకు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్డు విస్తరణ పనులకు గురువారం సాయంత్రం నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. నగరంలో ఇప్పటికే అన్ని డివిజన్లలో రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఖమ్మం నగరాన్ని మరింత సుందరీకరణ చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధి పనులు చేపట్టి నగర ప్రజల అవసరాల కనుగుణంగా మౌళిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. ఆయా డివిజన్లలో చేపడ్తున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు.

నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆయా డివిజన్ల కార్పోరేటర్లు కూరాకుల వలరాజు, కొత్తపల్లి నీరజ, డి సత్యనారాయణ, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post