నగరంలో చేపడ్తున్న అంతర్గత రహదారుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 22,ఖమ్మం:

నగరంలో చేపడ్తున్న అంతర్గత రహదారుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 4 వ డివిజన్, మంచికంటి నగర్: రాజీవ్ గుట్ట నందు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సి.సి. రోడ్డు, కాలువల నిర్మాణ పనులను బధవారం నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేసారు. ఖమ్మం నగరంలోని ప్రతి వీధిలో అంతర్గత రహదారులను అభివృద్ధి పర్చి లైటింగ్, మురికి కాలువల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షించాలని. ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.

అనంతరం రఘునాథపాలెం మండలం కోయచెలక క్రాస్  రోడ్ వద్ద కీర్తిశేషులు ఊట్ల దీప్తి గారి జ్ఞాపకార్ధం నిర్మించిన బస్ షెల్టర్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, స్థానిక కార్పోరేటర్ శ్రీమతి దండా జ్యోతి, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post