నగరంలో ముగింపు దశలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

జనవరి,04 ఖమ్మం:

నగరంలో ముగింపు దశలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని గట్టయ్య సెంటర్లో నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ కార్యాలయం భవనం పనులను నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులు, గుత్తేదారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. గోళ్ళపాడు చానల్ పనులను ప్రకాష్ నగర్ ప్రాంతంలో పరిశీలించి మురుగునీటి శుద్దీకరణ కేంద్రం, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ ఇఇ కృష్ణలాల్, డిఇ రంగారావు, ఖమ్మం అర్బన్ తహశీల్దారు శైలజ, అధికారులు గుత్తేదారులు: తదితరులు పాల్గొన్నారు.

Share This Post