నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో అంతర్గత రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులకు అనుసందానం చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 28, ఖమ్మం:

నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో అంతర్గత రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులకు అనుసందానం చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రూ.1 కోటి 6 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లను మంత్రి మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలోని 53వ డివిజన్ ఎన్.ఎస్.టి రోడ్, 26వ డివిజన్ పోలీసు కమీషనర్ కార్యాలయం, 24వ డివిజన్ కాషయ్య నగర్, 12వ డివిజన్ రాధకృష్ణ నగర్ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకొని రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు. ఖమ్మం. నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు రూ.30 కోట్ల నిధుల నుండి 41 డివిజన్లలో 140 రోడ్స్ ఏర్పాటు చేయనున్నమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానలను వినియోగించుకుని ఇప్పటికే నగరంలో పలు ప్రధాన దారుల్లో బ్లాక్ టాప్ (బి.టి) రోడ్స్ వేయడం జరిగిందన్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించామన్నారు.

సూడా చైర్మన్ బచ్చు విజయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రంజిత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post