నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2022 లో భాగంగా తేది : 01-01-2022 నాటికి 18 సం॥ల వయస్సు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డులు (ఎపిక్‌ కార్జు) బూత్‌ స్థాయి అధికారుల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల మార్పులు, చేర్పులు ఇతరత్రా అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం క్రొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఎపిక్‌ కార్డును పోస్టు ద్వారా అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్‌ కిట్‌లో వ్యక్తిగత లేఖ, ఓటర్‌ గైడ్‌, ఓటర్‌ ప్రతిజ్ఞ, ఎపిక్‌ కార్డు కలిగి ఉంటుందని, ఓటర్‌ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, 18 సం॥ల వయస్సు నిండి ఓటర్‌ నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేరు, చిరునామా ఇతరత్రా మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని, ఏకరీతిగా ఫోటోలు ఉన్న జాబితా పరిశీలించి సరి చేయాలని తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్‌ కార్డులను రాష్ట్ర ఎన్నికల కష్వషన్‌ కార్యాలయం నుండి తీసుకువెళ్ళాలని, అదే విధంగా ఈ.వి.ఎం.లు భద్రపరచిన గోదాములను పర్యవేక్షించాలని, నూతన భవనాలకు ఈ.వి.యం.లు ఇంకా మార్చని వారు వెంటనే మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా విస్నత ప్రచారం, అవగాహన కల్పించాలని, స్వీప్‌ యాక్టివిటీస్‌ నిర్వహించి ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేసి 18 సం1ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటరు దినోత్సవం నాటికి నూతనంగా వివరాలు నమోదు చేసుకున్న 2 వేల 436 మందికి ఫొటో ఓటరు గుర్తింపు కార్జ్డుతో పాటు ఓటర్‌ కిట్‌ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post