నమ్మకమే ప్రధానం…జిల్లా కలెక్టర్ శశాంక

నమ్మకమే ప్రధానం…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం

మహబూబాబాద్, నవంబర్ 30.

ప్రభుత్వ వైద్యంపట్ల ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రజ్ఞ సమావేశ మందిరంలో ప్రసవాలు, ఇమ్యునైజేషన్, ఏ.ఎం.సి.రిజిస్ట్రేషన్, అనిమియా తదితర అంశాలపై జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ అధ్యక్షతన ఉప వైద్యాధి కారులుతోకమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, పి.హెచ్.సి.డాక్టర్ లతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రసూతులను పెంచుతూ ప్రజల్లో నమ్మకం పెంచాలని, అందుకు ప్రజాప్రతినిధులు తో సమావేశం ఏర్పాటు చేసుకొని సహకారం పొందాలన్నారు.

తొర్రుర్, మరిపెడ, కొత్తగూడ వైద్యాధికారులు, సిబ్బంది పనితీరును కలెక్టర్ ప్రశంసించారు. ఇదే రీతిగా అన్ని అంశాలలోను ప్రగతి సాధించాలన్నారు. డోర్నకల్ వైద్యాధికారులు ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఇమ్యునైజేషన్ లో ఇనుగుర్తి, మహబూబాబాద్ లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంటర్నెట్ సౌకర్యాలు, సిబ్బంది కొరత వంటివి సరికాదని, వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

అదేవిధంగా పి.హెచ్.సి.డాక్టర్ లు సబ్ సెంటర్ లను తనిఖీ చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఉప వైద్యాధికారులు ఉమా గౌరీ, ఇమ్యునైజేషన్ పి.ఓ.డాక్టర్ రాజేంద్రప్రసాద్, తొర్రుర్ మురళీధర్, మహబూబాబాద్ డాక్టర్ అంబరీష, ఎం.సి.హెచ్.బిందు పి.హెచ్.సి.డాక్టర్ లు ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post