నర్సరిలు, ఉపాధి హామీ పనులు వ్యాక్సినేషన్ పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, ZP CEO ప్రియాంక

 

జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలి

ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్
00000

జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్ వ్యాక్సినేషన్, ఉపాధి హామీ కూలీలు, హరితహారం తదితర అంశాలపై వైద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓ లు, ఏపీఓ లు తదితర అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంకతో కలిసి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శు ల తో ఎంపీడీవోలు, ఎం పీ ఓ లు, వైద్యాధికారులు సమన్వయం చేసుకొని ఇంటింటి సర్వే చేస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. మొదటి డోస్ తీసుకున్న వారికి, తప్పని సరిగా రెండో డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు. మొదటి డోస్ తీసుకున్నవారు, రెండవ డోస్ తీసుకునే గడువు ముగిసిన వారిని గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. కోవిడ్ ప్రమాదం పూర్తిగా తొలగిపో లేదని, నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. కోవిడ్ తో మరణించిన వారి సంబంధీకులు మీ సేవలో దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని, కోవిడ్ మరణాలకు ప్రభుత్వం .రూ 50000/- ఎక్సగ్రేషియా ఇస్తుందని తెలిపారు.

గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ కూలీల శాతం పెంచి వారికి పనులు కల్పించాలని ఎంపీడీవో లను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఫీడర్ చానల్స్, కెనాల్స్ శుభ్రం చేయించాలని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్న వారందరితో పనులు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బృహత్ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో పనులు చేయించాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున ఎంపీడీవోలు, ఎంపీఓలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో స్థానిక ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొనవద్దని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డి పి ఓ వీర బుచ్చయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, డి ఎం హెచ్ ఓ డాక్టర్ జు వేరియా, డి ఎల్ పి వో లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీఓలు, ఏ పీ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post