నర్సరీలో సిబ్బందికి వేతనాలు సకాలంలో అందజేయాలి…

ప్రచురణార్థం

నర్సరీలో సిబ్బందికి వేతనాలు సకాలంలో అందజేయాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 17.

మీలో నర్సరీలో పనిచేసే సిబ్బందికి వేతనాలు సకాలంలో అందజేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని అయోధ్య mudupugal గ్రామాల లోని నర్సరీ స్మశాన వాటికలను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాల వాచర్లు తమకు వేతనాలు అందడం లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తేగా అధికారులు ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

స్మశాన వాటికలో గదులు విద్యుత్ నీటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు గ్రామాలలో వ్యక్తులు మరణిస్తే రికార్డులలో నమోదు చేస్తూ స్మశాన వాటిక లో సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిఓ హరి ప్రసాద్ ముడుపుగల్ గ్రామ సర్పంచ్ యాస రమ వెంకట్ రెడ్డి, అయోధ్య mudupugal పంచాయతీ సెక్రటరీలు హనుమంతు స్పందన ఈ సి ప్రదీప్ టి ఏ లు రమేషు స్వప్న తదితరులు పాల్గొన్నారు
——————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post