ప్రతి శుక్రవారం ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో నర్సరీల్లో మొక్కలు పెంపకం, వంగిన, పడిపోయిన విరిగిన ట్రీ గార్డ్లు సరి చేయడంతో పాటు మొక్కలకు సపోర్ట్ గా కర్రలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన రహదారులపై చాలా చోట్ల ట్రీ గార్డ్లు విరిగిపోయినట్లు లేదా పడిపోయినట్లు కనిపిస్తున్నాయని అన్నింటినీ సక్రమంగా పునరుద్ధరణ చేసి మొక్కలు చక్కగా పెరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. నర్సరీలో మొక్కల పురోగతిని సమీక్షించాలని చెప్పారు. మొక్కలకు పాదులు తీయడం చేపట్టాలని చెప్పారు. ప్రధాన రహదారులపై అనేక చోట్ల ట్రీ గార్డులు, మొక్కలను సక్రమంగా నిర్వహించడంలో జాప్యం ఉన్నట్లు గమనించామని మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్ ప్రతి ఒక్కరూ ఈ పనులకు హాజరు కావాలని నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. శుక్రవారం అధికారుల క్షేత్ర సందర్శనలో నర్సరీ పురోగతి మరియు మొక్కల సంరక్షణపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలను సంబంధిత ఎంపిడిఓ ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించబడే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్కడక్కడ సరైనాజాగ్రత్తలు తీసుకోకపోవడం జరుతున్నట్లు గమనించడం జరిగిందని యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని, ఇది చాలా ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. నర్సరీల పురోగతిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మొక్కలకు నీళ్ళు పోయడం, ట్రీ గార్డ్లు, సాసరింగ్ మరియు మొక్కలకు కుదుళ్లు చేయడం మొక్కల సంరక్షణపై శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు.