నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు… జిల్లా కలెక్టర్ నిఖిల

రాబోయే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటేందుకు అన్ని నర్సరీలలో లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.

మంగళవారం బొమ్రాసిపేట మండలం, చౌదర్ పల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ వినియోగం, నర్సరీ నిర్వహణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి హరితహారంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. నర్సరీలో విత్తిన మొక్కలు పెరుగకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్యాగ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు నాణ్యమైన మట్టితో పాటు మంచి విత్తనాలు విత్తలన్నారు. నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, బ్యాగులలో వెంటనే నాణ్యమైన మట్టి నింపి కొత్తగా విత్తనాలు విత్తలనీ సూచించారు. జూన్ మాసం వరకు అవసరమైన మొక్కలు అందించాలని ఆదేశించారు. స్థానిక పాఠశాలలో, గ్రామంలో కలియతిరిగి నాటిన మొక్కలను పరిశీలించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే మొక్కలు తెచ్చి నాటాలని సూచించారు. అలాగే గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. డంపింగ్ యర్డులో తడి పొడి చేత్త వేరుగా చేసి ఎరువుల తయారీ చేపట్టాలన్నారు. దుంపంగ్ యార్డులను వినియోగంలోకి తేవాలని, గ్రామ పంచాయతీకి ఆదాయం సమాకూర్చాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, తహసీల్దార్ షహీదాబేగం, ఎంపీవో పండు, ఎంపీపీ హేమీ బాయి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Share This Post