నర్సింగాయాపల్లిలో నిర్మిస్తున్న పి.జి, మెడికల్ కళాశాల, మాత, శిశు ఆరోగ్య కేంద్రాల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.      తేది:15.11.2021, వనపర్తి.

వనపర్తి లో నిర్మిస్తున్న పి.జి, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు, అన్ని ఏర్పాట్లు డిసెంబర్ 7వ.తేది లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
సోమవారం వనపర్తి సమీపంలోని నర్సింగాయాపల్లిలో నిర్మిస్తున్న పి.జి. మెడికల్ కళాశాల, మాత, శిశు ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లేబర్ సామర్థ్యాన్ని పెంచి, సంబంధిత అధికారులు, ఇంజనీర్లు ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. డిసెంబర్ 7వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, డి. ఎం & హెచ్. ఓ. చందు నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ రాజేందర్ గౌడ్, సూపరింటెండెంట్, వైద్య, ఆరోగ్య శాఖ ఈ.ఈ, ఏ.ఈ, డి.ఈ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాజ్ కుమార్, రావుల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post