నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా నర్సింగ్ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూలు పట్టణ శివారులో ఉయ్యాలవాడ వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల జీ ప్లస్‌ టూ పనులను కలెక్టర్‌ పరిశీలిస్తూ పనులను నాణ్యతతో చేపట్టే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు.
రూ.28 కోట్లతో సుమారు లక్ష చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల పనుల ప్రగతిని ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఫేంత్ భీమ్ నిర్మాణ పనులు వర్క్ ప్రోగ్రస్ లో ఉందని అధికారులు తెలిపారు.
నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ భాస్కర్, డిఈ రమాదేవి,జేఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post