నర్సింగ్ కళాశాల నూతన భవనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపుకై చేపడుతున్న నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి- జిలా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నర్సింగ్ కళాశాల నూతన భవనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపుకై చేపడుతున్న నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిలా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఉయ్యాలవాడ వద్ద నిర్మాణంలో ఉన్న నూతన నర్సింగ్ కళాశాల భవనం, ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల స్థాయి పెంపు కై చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్.అండ్.బి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పర్వవేక్షించిన కలెక్టర్ ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనుల వల్ల ఆసుపత్రి రోజువారి కార్యకలాపాలు, ముఖ్యంగా శస్త్ర చికిత్సల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలన్నారు. ఆక్సిజన్ ప్లాంటేషన్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి మనుగడలోకి తీసుకురావాలని సూచించారు.
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. శివరాం, ఆర్.అండ్ బి ఈ.ఈ భాస్కర్ , డిఇ రమాదేవి, డా. రోహిత్, కాంట్రాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Share This Post