నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,     తేది:23.11.2021, వనపర్తి.

నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె తెలిపారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని తనిఖీ చేసి, ప్లాంటేషన్ ను ఆమె పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణం అందమైన మొక్కలను నాటి, పరిసరాలను తీర్చిదిద్దాలని, ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ.ఈ. దేశ్య నాయక్, డి.ఈ. దానయ్య, కాంట్రాక్టర్ రామారావు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post