నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్

నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్

ప్రచురణార్థం

నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్.

మహబూబాబాద్, మే -08:

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి ఆదివారం పరిశీలించారు.

ఈ నెల 10 న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా పర్యటన సందర్భంగా నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి పనుల పురోగతిని, కళాశాల వద్ద చేపట్టిన, చేపట్టనున్న పనులపై ప్లాన్ ను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఈ ఈ – అర్. అండ్ బి. తానేశ్వర్, ఏ. ఈ., డి.ఈ.సి. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ సంపూర్ణ రావు, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post