నర్సింగ్, వైద్య కళాశాలల నిర్మాణ బాధ్యతలు చేపట్టిన గుత్తే దారు ఐదు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం పాల్వంచ మండలంలో నిర్మించనున్న వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణ స్థలాన్ని రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.  జరుగుతున్న పనులపై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని చెప్పారు. పనులు. ముమ్మరం చేయాలని నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయుటకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. భూమి చదును కార్యక్రమం పూర్తి అయినందున సిమెంట్ పనులు చేపట్టాలని చెప్పారు. అనంతరం బూర్గంపహాడ్‌ మండలంలో  కలెక్టర్  ఆకస్మిక సందర్శన నిర్వహించారు. బూర్గంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తనిఖీ   సమయంలో  వైద్య అధికారి అందుబాటులో.లేకపపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, రికార్డులు,  RO ప్లాంట్ మరియు లేబర్ రూమ్ ఇతర పరికరాలు నిర్వహణ సక్రమంగా  లేనట్లు గమనించారు.   బూర్గంపాడులోని  గౌతమీపురం అంగన్‌వాడీ కేంద్రాన్ని  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.  పర్యవేక్షకులు కానీ  సిడిపిఒ కానీ కలెక్టర్ తనిఖీ సమయంలో అందుబాటులో లేనట్లు గమనించారు. అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు పరిశీలించారు.  రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేదని, తప్పక రిజిస్టర్లు నిర్వహించాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ర.భ. ఈ ఈ భీంలా, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post