నర్సింహుల పేట మండలం లో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నర్సింహుల పేట మండలం లో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నర్సింహుల పేట,
మహబూబాబాద్ జిల్లా, ఆగస్ట్-17:

అవెన్యూ ప్లాంటేషన్ ను క్రమ పద్ధతిలో ఒక వరుసలో చక్కగా ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

నర్సింహుల పేట మండలం లోని కొమ్ముల వంచ, పెద్ద నాగారం, అజ్మీరా తండా, రామన్న గూడెం గ్రామాల్లో పర్యటించి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. కొన్ని చోట్ల మొక్కలకు ట్రీ గార్డ్ లు లేకపోవడం గమనించి వెంటనే ట్రీ గార్డ్ లు ఎర్పాటు చేయాలని ఎం.పి.డి.ఓ. ను ఆదేశించారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరంతర పర్యవేక్షణ గావించి మొక్కల ఎదుగుదలకు కృషి చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలో ఏర్పాటుచేసిన అవెన్యూ ప్లాంటేషన్ వివరాలను జిల్లా కలెక్టర్ కు ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి వివరించారు.

——————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post