నల్గొండ,అక్టోబర్ 2 జాతి పిత మహాత్మా గాంధీ ఆదర్శాలను,ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్య దిశగా అందరం నడవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు

శనివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని రామగిరి లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,   పూలమాలలు  వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యాగ్రహం ఆయుధం గా,శాంతి, అహింస మార్గంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన  మహోన్నత వ్యక్తి గాంధీజీ అని ,  అయన  అడుగుజాడల్లో అందరు  నడవాలని,  గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయని, ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు
*జిల్లా కలెక్టర్ కార్యాలయం లో*
  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతీ లాల్, పూలమాలవేసి మహాత్మునికి ఘననివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి,చందన వదన, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post