నల్గొండ,జనవరి 19. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలని, అన్ని జి.పి.లలో జాబ్ కార్డ్ కలిగిన కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి. ఎం.పి.డి.ఓ.లు,ఏ.పి.ఓ.లు,పంచాయతీ రాజ్ డి.ఈ. లు.,ఏ.ఈ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,వైకుంఠ దామం ల నిర్మాణం ప్రగతి పనులు మండలం ల వారిగా సమీక్షించారు.ప్రతి జి.పి.లో ఒక ఫామ్ పాండ్ కాని,ఫిష్ పాండ్ కాని ఉపాధి హామీ కింద చేపట్టాలని ఆదేశించారు. చాలా మండలం లలో ఉపాధి హామీ కింద కూలీలకు పనులు కల్పించడం లో ఆశించిన మేర ప్రగతి లేదని,ప్రతి జి.పి.లో పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పించాలని అన్నారు.లేబర్ బడ్జెట్ పూర్తిగా వ్యయం చేయాలని సూచించారు. వైకుంఠ దామం లు నిర్మాణం పనులు సమీక్షిస్తూ  మిగిలిన ఉన్న పెండింగ్ పనులు జనవరి లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎం.పి.డి.ఓ.లు స్వయంగా పర్యటించి వైకుంఠ దామం ల పనులు మిగిలి ఉన్న జి.పి.లలో వెంటనే పనులు పూర్తి చేయాలని అన్నారు.ఉపాధి హామీ పనులు పరిశీలన చేసేందుకు నేషనల్ మానిటరింగ్ టీమ్ జిల్లా లో పర్యటించనున్నందున సంబంధించిన రిజిష్టర్ లు,రికార్డ్ లు అప్డేట్ చేసి సిద్ధం గా ఉండాలని సూచించారు.ఈ వి. సి.లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,జడ్.పి.సి. ఈ. ఓ.వీర బ్రహ్మ చారి, డి.ఆర్.డి.ఓ.కాళిందిని, పి.ఆర్.ఈ. ఈ. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

Share This Post