నల్గొండ,నవంబర్ 30. నల్గొండ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి::: జిల్లా కలెక్టర్ ప్రశాంత్

నల్గొండ,నవంబర్ 30. నల్గొండ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్ లో స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎల్.సి.ఎన్నికల షెడ్యూల్ వివరించి,ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించి ఎన్నికకు సహకరించాలని కోరారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.ర్యాలీ లు నిషేధమని అన్నారు.పోలింగ్ రోజు అభ్యర్థి తిరిగేందుకు రెండు వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందని,రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రచార సమయం ఎన్నిక పోలింగ్ సమయం ముగిసేందుకు 72 గంటల ముందు ముగుస్తుందని తెలిపారు.
.ఎన్నికల ఏజెంట్,పోలింగ్ ఏజెంట్,కౌంటింగ్ ఏజెంట్ నియమించు కోవాలని,కౌంటింగ్ ఏజెంట్ వివరాలు డిసెంబర్ 4 లోపల సమర్పించాలని అన్నారు.పోలింగ్,కౌంటింగ్,ఎన్నికల ఏజెంట్ స్థానిక సంస్థల నల్గొండ  ఎం.ఎల్. సి.నియోజకవర్గ పరిధి లోసాధారణ ఓటర్ గా నమోదు అయి ఉందాలని అన్నారు.డిసెంబర్ 9 న ఉమ్మడి జిల్లా నల్గొండ, సూర్యాపేట,భువన గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం లలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని,అభ్యర్థులు వారి ప్రతినిధులు హాజరు కావచ్చని తెలిపారు.డిసెంబర్ 10 న పోలింగ్ ముగిసిన అనంతరం  రిసెప్షన్ కేంద్రం నల్గొండ జిల్లా కేంద్రం  లో జిల్లా మహిళ సమాఖ్య భవనం లో పోలింగ్ కేంద్రాల నుండి పోలింగ్ మెటీరియల్ వస్తుందని,అభ్యర్థులు ఎస్కార్ట్ తో రావచ్చని, రిసెప్షన్ కేంద్రం లో అభ్యర్థుల సమక్షంలో లో స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలెట్ బాక్స్ లు,పోలింగ్ సామగ్రి భద్రపరచటం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశం లో టి.ఆర్.ఎస్ అభ్యర్ధి ఎం.కోటి రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధులు  కాసం వెంకటేశ్వర్లు, రాం సింగ్ కొర్రా,బెజ్జం సైదులు,అరుపుల శ్రీశైలం,డా.కె నగేష్,వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area

Share This Post