నల్గొండ, ఆక్టోబర్ 2 భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఆజాదికా అమృత్ మహోత్సవం

                            నల్గొండ, ఆక్టోబర్ 2 భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఆజాదికా అమృత్ మహోత్సవం లో భాగంగా స్థానిక ఎన్ జి కళాశాల మైదానం నుండి రెడ్ క్రాస్ భవన్ వరకు రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి హాజరు అయ్యారు. గౌరవ అతిధి గా అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  హాజరయ్యారు. శాసన సభ్యులు గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఆనంతరం అయన మాట్లాడుతూ గాంధీజీ కళలు గన్న ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ భారత్ నిర్మాణంలో యువత సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్తలకు దూరంగా ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ  మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన క్లీన్ ఇండియా కాంపెయిన్ నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 31 వరకు ప్రతి గ్రామపంచాయతీ, మునిపాలిటీ పరిధిలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా కాంపెయిన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కాంపెయిన్ ను యువత మరియు గ్రామా ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం క్లీన్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. వేదిక పై నాగార్జున అకాడమీ అద్వర్యం లో యోగ కరాటే విన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వంకటేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, యువజన క్రీడా అధికారి మఖ్బుల్ అహ్మద్, ఎన్ సి సి సుబేదార్ మేజర్ రాజేంద్రన్ నైర్, నెహ్రు యువ కేంద్ర జిల్లా అధికారి భూక్యా ప్రవీణ్ సింగ్, డాక్టర్ పుల్లా రావు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దోమల రమేష్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరుణాకర్, పర్యావరణ వేత్త సురేష్ గుప్తా, ప్రజా ప్రతినిదులు, యూత్ వాలంటరీస్, యువజన సంఘాలు, ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, తైక్వాండో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post