*నల్గొండ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్* *నల్గొండ పట్టణం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శన,కొనుగోళ్ల పై రైతులతో మాట్లాడిన గవర్నర్*

సజావుగా ధాన్యం సేకరణ,సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్*
నల్గొండ,డిసెంబర్ 8. రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ బుధవారం నల్గొండ పట్టణం  లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హైదరాబాద్ నుండి  ఉదయం 11.33 గంటలకు నల్గొండ కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ కు అర్&బి అతిథి గృహం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.ఐ.జి.,ఎస్.పి.ఏ.వి.రంగ నాథ్ లు పుష్ప గుచ్ఛం అంద చేసి స్వాగతం పలికారు.ఆర్&బి అతిథి గృహం నుండి నల్గొండ పట్టణం షేర్ బంగ్లా లోని పునః ప్రతిష్టించిన   శ్రీ భక్తాoజనేయ సహిత సంతోషి మాత దేవాలయం ను ప్రారంభించి,ధ్వజ,స్తంభ,శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు. దేవాలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో  పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డి.ఐ. జి.ఎస్.పి.ఏ.వి.రంగ నాథ్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి, మాజీ ఎం.ఎల్.సి.పొంగు లేటి సుధాకర్ రెడ్డి, ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు .
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన గవర్నర్*
నల్గొండ పునః ప్రతిష్టించిన శ్రీ భక్తాoజనేయ సంతోషి మాత దేవాలయం ప్రారంభించిన అనంతరం ఆర్&బి అతిథి గృహం చేరుకున్నారు. తర్వాత నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించారు.మొదట నల్గొండ పట్టణం లో అర్జాల బావి వద్ద ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్.వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు.కొనుగోలు కేంద్రం లో యాసంగి సీజన్ లో వరి ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి రైతు లతో మాట్లాడారు.నల్గొండ పట్టణం చర్లపల్లి కి చెందిన మందడి మధు సూధన్ రెడ్డి,పానగల్ నుండి ధాన్యం తెచ్చిన మల్లమ్మ అనే రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయం లో ఏమైనా సమస్యలు ఉన్నాయా , ఎన్ని బస్తాలు ధాన్యం వచ్చింది రైతులు అడిగి తెలుసుకున్నారు.వర్షం కారణంగా తేమ శాతం  వచ్చే వరకు కొనుగోలు కేంద్రం లో ఆరబెట్టి నట్లు తెలిపారు.గవర్నర్ వారితో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి మీతో మాట్లాడ టానికి వచ్చాను అని తెలిపారు.రైతు మల్లమ్మ తో నేను తెలుసా రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ అని పరిచయం చేసుకున్నారు.
అనంతరం అనిశెట్టి దుప్పల పల్లి లో ఏర్పాటు చేసిన ఐ. కె.పి.వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను గవర్నర్ సందర్శించారు.కొనుగోలు కేంద్రం లో కె.మారయ్య,ఎన్. తిరుపతయ్య లతో గవర్నర్ మాట్లాడారు.ఎన్ని రోజులు అయింది,కొనుగోళ్ల లో సమస్యలు ఉన్నాయా తెలుసుకున్నారు.గన్ని లు సరి పడ ఉన్నాయా,ఎంత మంది రైతులు ఉన్నారు అని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రం నిర్వాహక మహిళల తో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు.మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంట 72 శాతం సేకరణ జరిగిందని,249 వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి కొనుగోలు నిర్బహిస్తున్నట్లు,గత సీజన్ లో ఏర్పాటు చేసిన 182 కొను గోలు  కేంద్రాల కంటే ఎక్కువ అని వెల్లడించారు.కొంత వాతావరణ సమస్యలు ఉన్నాయని,సజావుగాసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.గవర్నర్ వెంట డి.ఐ. జి.,ఎస్.పి.ఏ.వి.రంగ నాథ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా సహకార అధికారి ప్రసాద్,డి.ఆర్.డి.ఓ.కాళిందిని,పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post