నల్గొండ, డిసెంబర్ 30.నల్గొండ పట్టణం లోని నీలగిరి నందనవనం అర్బన్ పార్క్ ను సందర్శకులను ఆహ్లాద పరిచే విధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు

.గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి నందన వనం అర్బన్ పార్క్ ను సందర్శించి పార్క్ లో కలియ తిరిగారు.పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను డి.ఎఫ్.ఓ.రాం బాబు  జిల్లా కలెక్టర్ కు వివరించారు.పార్క్ లో పగోడా నిర్మాణం సివిల్ పనులు పూర్తి చేసినట్లు,తుది మెరుగులు దిద్దే పనులు చేయవలిసి ఉందని, పార్క్ ప్రవేశం వద్ద ముఖ్య ద్వారం పనులు మొదలు పెట్టినట్లు,నీరు నిల్వ ఉండ కుండా డ్రైనేజీ పనులు, పర్కొలేషన్ ట్యాoక్ పనులు ప్రగతి లో ఉన్నట్లు ,రోడ్డు రిపేర్ పనులు ప్రారంభించవలసి ఉందని తెలిపారు.ప్లాంటేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు.పార్క్ లో సైక్లింగ్ కు 5 సైకిళ్ళు,బ్యాటరీ ఆటో ,పిల్లల ఆడు కునేలా పరికరాలు,జంతువుల ప్రతిమలు, సైన్ బోర్డ్ లు ఏర్పాటు పనులు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.అనంతరం ఆర్.టి.ఓ.కార్యాలయం,పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ కి కేటాయించిన స్థలమును సందర్శించి ఎంత విస్తీర్ణం లో ఉంది అధికారులను అడిగి తెలుసుకున్నారు.హెలిపాడ్ కు స్థల సేకరణ లో భాగంగా పరిశీలించారు.జిల్లా కలెక్టర్ తో డి.ఎఫ్.ఓ.రాం బాబు, ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,తహశీల్దార్ నాగార్జున లు ఉన్నారు
నల్గొండ, డిసెంబర్ 30.నల్గొండ పట్టణం లోని నీలగిరి నందనవనం అర్బన్ పార్క్ ను సందర్శకులను ఆహ్లాద పరిచే విధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

Share This Post