నల్గొండ, నవంబర్ 24 ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజక వర్గ ఎన్నిక ఏర్పాట్లు పై ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్ రిటర్నింగ్ అధికారి,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో చర్చించారు.

బుధవారం   స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర మైనార్టీ సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్ నల్గొండ జిల్లాకు విచ్చేశారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్,సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్రశేఖర్ లతో సమావేశమై ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు పై చర్చించి సూచనలు చేశారు.స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి,నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆయనకు వివరించారు.  అనంతరం జిల్లా కేంద్రంలో ఎన్. జి.కళాశాల లో కౌంటింగ్ కేంద్రం ను ఎన్నికల పరిశీలకులు సందర్శించి  కౌంటింగ్ కేంద్రం వద్ద రిసెప్షన్ సెంటర్ , కౌంటింగ్ హాల్,స్ట్రాంగ్ రూమ్  ఏర్పాట్ల పై చర్చించి సూచనలు చేశారు.. కౌంటింగ్ నిర్వహణకు కోవిడ్ నిబంధనలు ననుసరించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ననుసరించి కౌంటింగ్ హాల్ లు ఏర్పాటు చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ వివరించారు. .జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్,సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్ర శేఖర్, ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ నాగార్జున  తదితరులు పాల్గొన్నారు.

Share This Post