నల్గొండ పట్టణం,మున్సిపాలిటీ ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు*

నల్గొండ పట్టణం ను,జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.బుధవారం నల్గొండ పట్టణం కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర  శేఖర్ రావు ఇటీవల మరణించిన తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ తండ్రి కీ.శే. గాదరి మారయ్య పెద్ద కార్యం కు హాజరై ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.గాదరి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీష్ రావు,శ్రీనివాస్ గౌడ్ ,ఎం.ఎల్.సి.లు,శాసన సభ్యులతో కలిసి నల్గొండ పట్టణ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. నల్గొండ పట్టణం ను అన్ని విధాలుగా అభివృద్ధి కి ప్రత్యేక ప్రణాళిక లు రూపొందించాలని,పట్టణ రూపు రేఖలు మార్చాలని అన్నారు.నల్గొండ పట్టణం అభివృద్ధికి, నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని సి.యం.తెలిపారు.నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ పరిధి లో రోడ్లు అభివృద్ధి పరచి,జంక్షన్ లు ఏర్పాటు అభివృద్ధి  కి చర్యలు తీసుకోవాలని అన్నారు.నల్గొండ పట్టణ జనాభా ననుసరించి పట్టణం ఇరువైపులా వైకుంఠ దామాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.పట్టణం లో వెజ్,నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్,అన్ని ఒకే చోట లభించేలా మాల్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.పార్క్ లు అభివృద్ధి పరచాలని,ఇందుకు ల్యాండ్ పూలింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.ఉదయ సముద్రం వద్ద ట్యా0కు బండ్, పార్క్ ఏర్పాటు కు ప్రతి పాదనలు రూపొందించాలని అన్నారు.పట్టణం లో టౌన్ హాల్ అభివృద్ది పరచాలని, మెడికల్ కాలేజి తో పాటు,నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు.హెలిపాడ్ కు స్థలం గుర్తించాలని అన్నారు.గజ్వేల్,సిద్దిపేట తరహా లో పట్టణం ను అభివృద్ధి పరచాలని అన్నారు.టౌన్ హాల్ నిర్మాణం చేయాలనీ, పట్టణం లో వోల్టేజి సమస్య లేకుండా ఎస్.పి.సి.డి.ఎల్.ఎస్.ఈ ని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు.ఎన్. జి.కళాశాల నూతన భవనంకు రెండు రోజుల్లో జి.ఓ.జారీ చేస్తామని అన్నారు. జిల్లాలో నంది కొండ,హాలియా లో  అభివృద్ధి పనులు,ఇతర మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి కి అవసర మైన పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.ఈ నెల 31 న రాష్ట్ర పురపాలన శాఖ మంత్రి,ఆర్&బి మంత్రి ,జిల్లా మంత్రి పర్యటిస్తారని,పట్టణ,మున్సిపాలిటీ ల అభివృద్ధి పై మున్సిపల్ కమిషనర్ లు,శాసన సభ్యులతో క్షుణ్ణంగా చర్చిస్తారని అన్నారు.పట్టణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అన్నారు.నల్గొండ పట్టణం కు మళ్లీ 15 రోజుల్లో వస్తానని సి.యం. తెలిపారు. ఈ సమావేశం లో మంత్రులు హరీష్ రావు,శ్రీనివాస్ గౌడ్,జగదీశ్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్.ఎల్.సి.పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్,చిరుమర్తి లింగయ్య,రవీంద్ర కుమార్,భాస్కర్ రావు, సైది రెడ్డి, జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్.పి.రేమా రాజేశ్వరిఅదనపు కలెక్టర్ లు వి.చంద్ర శేఖర్, రాహుల్ శర్మ, అధికారులు పాల్గొన్నారు

నల్గొండ పట్టణం,మున్సిపాలిటీ ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు*

Share This Post