నల్గొండ పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై క్షేత్ర స్థాయి పరిశీలన : జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

పత్రికా ప్రకటన
పత్రికా ప్రకటన నల్గొండ పట్టణం లో చేపట్టనున్న అభివృద్ధి పనుల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ,జనవరి 10 . నల్గొండ పట్టణ అభివృద్ధి లో భాగంగా చేపట్టనున్న పనుల పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో చర్చించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు,రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. టి.ఆర్.,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి లు ఇటీవల జిల్లాలో పర్యటించి నల్గొండ పట్టణ అభివృద్ధి కి పలు సూచనలు చేశారు.ఈ మేరకు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం కు కేటాయించిన జానపద కళా క్షేత్రం స్థలం లో శాశ్వత ప్రాతిపదికన హెలిపాడ్ నిర్మించుటకు అధికారుల తో చర్చించారు.హెలిపాడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు దారి, హెలిపాడ్ స్థలం లో వర్షపు నీరు పోయేందుకు డ్రైన్ నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.హెలిపాడ్ స్థలం లో
మున్సిపాలిటీ ద్వారా జంగిల్ క్లియరేన్స్ పనులు జరుగుతున్నాయి. అనంతరం హెలిపాడ్ నిర్మాణ పనులు చేపడతారు.క్లాక్ టవర్ వద్ద ఆర్&బి,ఐబి ఇంజనీరింగ్ కార్యాలయాలు ఉన్న చోట టౌన్ హాల్ నిర్మాణం చేయనున్నందున అందులో ఉన్న కార్యాలయాలు తాత్కాలికంగా షిఫ్ట్ చేయనున్నారు.ఆర్&బి ఎస్.ఈ., ఈ. ఈ., డి.ఈ కార్యాలయం లు జడ్. పి.ఎదురుగా ఉన్న ఎం.ఎల్.ఏ.క్యాంపు కార్యాలయం పక్కన మునిసిపల్ క్వార్టర్ భవనాలకు తాత్కాలికంగా షిఫ్ట్ చేయుటకు పరిశీలించారు. పాత జడ్.పి.కార్యాలయం లో ఐ. బి.ఇంజినీరింగ్ సి.ఈ., ఎస్.ఈ., డి.ఈ., ఏ.ఈ. ల కార్యాలయం లు తాత్కాలికంగా షిఫ్ట్ చేయుటకు పరిశీలించి అవసరమైన రిపేరులు చేపట్టి పని చేయుటకు తరలించాలని కలెక్టర్, శాసన స భ్యులు సూచించారు.
ఎస్.ఎల్.బి.సి.దగ్గర రెవరెండ్ ఎఫ్.ఆర్.ల్యూగి పెజ్జోని భవనం లో మెడికల్ కళాశాల విద్యార్థిని,విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని పి.ఆర్.ఇంజినీరింగ్ ఈ.ఈ. ని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్ళకు బి.టి. అప్రోచ్ రోడ్డు, దోమలు రాకుండా కిటికి లకు మెష్ ఏర్పాటు,హాట్ వాటర్ సదుపాయం,కిచెన్,డైనింగ్ కలసి ఉన్నందున పార్టీషన్ చేసి కిచెన్ ,డైనింగ్ హాల్ వేరుగా ఏర్పాటు,బాయ్స్ హాస్టల్ వెనుక సోక్ పిట్ తదితర పనులు చేపట్టాలని అధికారులకు వారు సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,ఆర్.డి.ఓ.జాగదీశ్వర్ రెడ్డి,జడ్.పి.సి.ఈ. ఓ.వీరబ్రహ్మ చారి,
ఆర్&బి ఎస్.ఈ. నరసింహ, డి.ఈ. నరేందర్, సర్వే,ల్యాండ్ రికార్డ్స్ ఏ. డి.శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ రమణా చారి,పంచాయతీ రాజ్ ఈ. ఈ. తిరుపతయ్య,
డి.ఈ. నాగయ్య,ఐ. బి.ఈ. ఈ జె.వి.వి.సత్య నారాయణ,
మున్సిపల్ డి.ఈ. లు అశోక్,వెంకన్న,టి.ఎస్.ఎం.ఐ. డి.సి.డి.ఈ. లోక్ లాల్ తదితరులు ఉన్నారు.

Share This Post