నల్గొండ పట్టణంలో మర్రి గూడ బై పాస్ నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు,సెంట్రల్ లైటింగ్,మీడియన్ పనులు, జంక్షన్ ల అభివృద్ధి పనుల ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత ఏజెన్సీలు, అధికారులను ఆదేశించారు

సోమవారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మున్సిపల్ చైర్మన్ ఎం. సైది రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి, ఏజెన్సీ లతో కలిసి పరిశీలించారు. ముందుగా చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి లెవెలింగ్ పనులు వెంటనే పూర్తి చేసి మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు.పార్కు లో వివిధ రకాల మొక్కలను నాటడానికి ఆవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎంట్రన్స్ గేట్ పనులు పూర్తి చేసి ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో జాతీయ రహదారిని కలుపుతూ పనులు వెంటనే ప్రారంభించాలని  కాంట్రాక్టర్ ను కోరారు. అర్బన్ పార్కు నిర్మాణంలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్, ఫుడ్ కోర్టు, టాయ్ లెట్స్ సౌకర్యం వంటి విషయాలపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.  అర్బన్ పార్కులో ఇటీవల నాటిన షిప్టింగ్ మొక్కలను పరిశీలించారు.  అనంతరం రామ్ నగర్ పార్కులో పర్యటించి అక్కడ వ్యర్థంగా నిరుపయోగంగా ఉన్న పరికరాలను వెంటనే తరలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. బోటింగ్ ప్రాంతాన్ని పర్యటించి అక్కడ సందర్శకులను ఆకర్శించే విధంగా అందంగా పెయింటింగ్  తో మొక్కలను నాటి సుందరిరకరణ చేయాలని సూచించారు. టికెట్ కౌంటర్లు, ఇటీవల పూర్తి చేసిన బెంచీలను, ఫౌంటేన్, ఆర్చ్ పనులను పరిశీలించి సూచనలు చేశారు పిల్లల ఆడుకునే వస్తువులకు కలరింగ్ చేయించాలని సూచించారు. అంతేగాకుండా పార్కులోని ట్రాక్ ను కూడా కలర్స్ తో అందంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్కులలో ఎంట్రెన్స్, ఫుడ్ కోర్టు, పార్కింగ్, టాయ్ లెట్స్, బోటింగ్, మొదలగు ప్రాంతాలలో ఏర్పాటు చేసే నేమ్ బోర్డులు ,వుడ్ ఫ్రేమ్ బోర్డులలో మాత్రమే ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహులను కోరారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ అభివృద్ధి పనులలో భాగంగా మిషన్ భగీరథ ట్యాప్, అశోక చక్ర, వెల్ కమ్ నల్లగొండ స్థలాలను పరిశీలించారు. అంతేగాక అక్కడ అవసరమైన వాటర్, ఎలక్ర్టిసిటీపై చర్చించారు. ఎలక్ట్రికల్ పోల్స్ ను తొలగించాలని ఇంజనీర్లను ఆదేశించారు. వెల్ కమ్ ఆర్చ్, ఫుట్ పాత్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన తెలిపారు. రోడ్డు మధ్యలో గల డివైడర్లలలో ఎర్రమట్టీని రెండు రోజులలో పూర్తి చేయాలని ఆయన తెలిపారు. డివైడర్ల మధ్యలో చెట్లను రెండు రోజులలో తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. డివైడర్ల మధ్యంలో అమర్చుతున్న చార్జబుల్ లైట్స్ ఆన్ ఆఫ్ ఏలా పని చేస్తాయని సంబంధిత ఏజెన్సీ నిర్వాహుకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి 10 ఎలక్ట్రీకల్ స్తంభాలకు ఒక స్విచ్ చొప్పున మొత్తం నాలుగు స్థలాలలో ఆన్ ఆఫ్ స్విచ్చులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.  పాలి టెక్నిక్ కళాశాల దగ్గరలోని కెనాల్ ప్రాంతంలో చిన్న గార్డెన్ పనులు,  పాల్ టెక్నిక్ కళాశాల వద్ద గల రెండు బస్ షెల్టర్లకు కూడా కలర్స్ వేయించాలని మున్సిపల్ కమీషనర్ ను కోరారు.  ఎలక్ట్రీకల్ టవర్స్ రెండు సైడ్లలలో మర్రిగూడ బైపాస్ నుండి క్లాక్ టవర్ వరకు ఎక్కడా పెండింగులో ఉంచకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.  పట్టణంలో  రోడ్డు ఇరువైపులా పనులు జరుగుతున్న ప్రాంతాలలో బస్తాలలో మట్టిని నింపి వరుసగా పెట్టడం లేదా సూచికలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  హైదరాబాద్ రోడ్డులోని రిలయన్స్ ట్రెండ్స్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ప్రత్యేక చొరవ తీసుకుని పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు. రోడ్డుకు ఒక సైడ్ పూర్తి చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వెంటనే మరోక సైడ్ లో పనులు పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం వచ్చే అవకాశం ఉన్నందున  టార్గెట్ పెట్టుకుని పనులు చేయాలని అన్నారు.  ఈ డ్రైనేజీ పనులపై స్పందిస్తూ రోజు వారీగా పనులను పర్యవేక్షించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అంతేగాక ప్రత్యేకంగా ఒక ఇంజనీరును కేటాయించాలని సూచించారు. ఈ నెల చివరికల్లా ఎట్టి పరిస్థితిలోను  పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.  బీట్ మార్కెట్ పరిధిలోని మార్కెటింగ్ కమిటీ కార్యాలయాన్ని మార్కెటింగ్ శాఖ భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని వెంటనే మున్సిపాలిటీ వారికి స్వాధీన పర్చాలని తెలిపారు. ముందుగా నిరుపయోగంగా ఉన్న శిథిల భవనాన్ని తొలగించాలని ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. బీట్ మార్కెట్ యార్డులోని వెజ్, నాన్ వెజ్ మార్కెటింగ్ పనులను పరిశీలించారు.  మార్కెట్ ను అనుగుణంగా ఫ్లాట్ ఫామ్ వర్కు పూర్తి చేసి గ్రానైట్ వేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయన అన్నారు.  మార్కెట్  ఎంట్రెన్స్ లో ఎలి వేషన్ పనులలో భాగంగా డిజైన్స్ ను ఏజెన్సీ నిర్వాహకులను వెంటనే అందించాలని మున్సిపల్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.  మార్కెట్ లోని రేట్లను సూచించే ఎల్.ఇ.డి. స్ర్కీన్ పై మున్సిపల్ కమీషనర్ తో చర్చించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కోరారు.  పోలీస్  హెడ్ క్వార్టర్స్  పరిధిలో పోలీస్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తొలగిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.  పోలీస్ శాఖ మున్సిపాలిటీ డిపార్టుమెంటుతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ పోలీస్ సిబ్బందికి సూచించారు.  క్లాక్ టవర్ సెంటర్ లో నూతనంగా నాలుగు కూడళ్లకు కనిపించే విధంగా క్లాక్ టవర్ ను నిర్మించడంతోపాటు అందులో పెద్ద క్లాక్ ను అమర్చాలని కాంట్రాక్టర్లను కోరారు. మార్కింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు.  క్లాక్ టవర్ సెంటర్ లోని మార్కింగ్ ప్రకారం షాపులను తొలగించే పనులను పర్యవేక్షించాలని ఇంజనీర్లను కోరారు. పెద్దబండ ప్రాంతంలోని రోడ్డుకు మధ్యలో డివైడర్లను నిర్మించడానికి సంబంధిత కాంట్రాక్టర్ పనులను ప్రారంభించాలని ఆయన కోరారు.
అనంతరం కలెక్టరేట్ ప్రక్కన నిర్మించనున్న హెలీప్యాడ్ పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంజనీర్లు అటవీ శాఖ పరిధిలోని ఎగువ ప్రాంతం నుండి వర్షపు నీరు వచ్చే అవకాశం ఉందని తెలుపగా, ఆయా ప్రాంతాలను కలెక్టర్ కలియ తిరిగి డ్రైనేజీ, వర్షపు నీరు  వెళ్లిపోయే విధంగా ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్దం చేసి రెండు రోజులలో సమర్పించాలని ఆయన ఆదేశించారు.  హెలీప్యాడ్ ప్రదేశం నుండి నేరుగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకునే విధంగా రోడ్డును నిర్మించాల్సి ఉందని ఆయన తెలిపారు. అందుకోసం ఇంజనీర్లు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ డా.కె.వి.రమణాచారి, పబ్లిక్ హెల్త్, టి. యు. ఎఫ్.ఐ. డి. సి.ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు,  వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, డి.ఎఫ్.ఓ. ఎస్. రాంబాబు, ఎఫ్.ఆర్.ఓ. బాచీరెడ్డి, మల్లారెడ్డి,  పోలీస్ హెడ్ క్వార్టర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సంతోష్, మున్సిపల్ ఈ ఈ శ్రీనివాస్, డి.ఇ.లు నర్సింహరెడ్డి, అశోక్, వెంకన్న,అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగిరెడ్డి,  ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణంలో మర్రి గూడ బై పాస్ నుండి క్లాక్ టవర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు,సెంట్రల్ లైటింగ్,మీడియన్ పనులు, జంక్షన్ ల అభివృద్ధి పనుల ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత ఏజెన్సీలు, అధికారులను ఆదేశించారు

Share This Post