నల్గొండ పట్టణంలో రహదారులు అభివృద్ధి,జంక్షన్ ల ఏర్పాటు,,మీడియన్ లు,ఫుట్ పాత్ లు,సైడ్ డ్రైన్స్,పట్టణ సుందరీకరణ పనులపై మున్సిపల్,ఆర్&బి,రెవెన్యూ,నేషనల్ హై వే అధికారులు ప్రణాళికా బద్దంగా సమన్వయంతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు

.బుధవారం నల్గొండ పట్టణంలో రహదారుల అభివృద్ధి,పట్టణ సుందరీకరణ పనుల పై స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో
 మున్సిపల్,ఆర్&బి రెవెన్యూ,నేషనల్ హై వే ఇంజినీరింగ్  అదికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ పట్టణ రహదారులు అభివృద్ధి, ఆదునికరణ పనులపై మున్సిపల్, రెవెన్యూ,నేషనల్ హై,వే రోడ్లు భవనాల శాఖల అదికారులు సమన్వయం తో కలిసి పనులు నిర్వహించాలని ఆదేశించారు.  పట్టణంలోని ప్రధాన కూడళ్లను జంక్షన్లుగా ఏర్పాటు చేసి ఆదునికరించాలన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ ద్వారా నామ్ రోడ్డు(మర్రి గూడ బై పాస్),వివేకానంద విగ్రహం,ఎన్. జి.కాలేజి,బస్ స్టాండ్ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం,కలెక్టరేట్, మునుగోడ్ రోడ్డు జంక్షన్(ఈద్గా ఎదురుగా),,నేషనల్ హైవే ద్వారా  క్లాక్ టవర్ వద్ద,  సావర్కర్ నగర్,పాత కలెక్టరేట్ జంక్షన్( ఆర్‌పి రోడ్ ), వన్ టౌన్ పోలీసు స్టేషన్, డిఇఓ ఆఫీసు, జైల్ ఖానా దగ్గర,  గంధ౦వారి గూడెం, వైఎస్‌ఆర్ విగ్రహం (సాగర్ రోడ్ )వద్ద చేపట్టాలని నిర్ణయించారు. డిజైన్ లను మున్సిపాలిటీ నేషనల్ హైవే శాఖ కు అంద చేయనున్నారు. రాబోయే 40 సంవత్సరాల కు ఉపయెగపడే విధంగా రోడ్లను అబివృది చేయాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఆయన అదికారులను ఆదేశించారు.
నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో మెత్తం 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన జంక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా జంక్షన్లను ఎల్ ఇ డి లైటింగ్ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు.పట్టణ పరిధిలో నకిరేకల్ టు సాగర్ ఎన్ హెచ్ 565 రహదారి పట్టణం నుండి 10 కిమీ పాన గల్ నుండి ఎస్.ఎల్.బి.సి రహదారి  పోర్ లేన్ చేయాలని,ప్రస్తుతం 10 కి.మీ.లలో 3 కి.మీ పోర్ లేన్ తో పాటు మిగిలిన 7 కి మీ.రహదారిని పోర్ లేన్ రహదారి గా రూపొందించుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని నేషనల్ హైవే అధికారులను కోరారు.  అంతే గాక రైతు బజార్ల నిర్మాణానికి స్తలాలను గుర్తించాల్సి ఉంధని అదికారులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు పై సంబందిత అదికారులతో మాట్లాడాలని కలెక్టర్ ని కోరారు. తొలుత
మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ఇటీవల నల్గొండ పర్యటనలో రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ధి,ఐ. టి. శాఖ మంత్రి కె. టి.ఆర్ సూచించిన విధంగా ఎన్‌.యు.డి‌.ఏ (నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి) ఏర్పాటు తో నల్గొండ తో పాటు చుట్టుపక్క ల ఉన్న ప్రాంతాలను కూడా డెవలప్ చేయవచ్చన్నారు.  రాష్ట ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందని అన్నారు. నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి ద్వారా భూముల రేట్లు పెరగడం తో పాటు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పాటు అవుతాయని, ప్రభుత్వానికి లే అవుట్స్  రాబడి పన్నుల రూపంలో వస్తుందని,ఇందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు, ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపనున్నట్లు వివరించారు.
సమావేశంలో రోడ్ల అభివృద్ధి పై రూపొందించిన మ్యాపులను పరిశీలించారు.తొలుత  కోమటి రెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పక్కన,బస్తీ దవాఖాన, రైతు బజార్ కు,ఎల్లమ్మ గుడి ప్రక్కన మినీ వెజ్,ఫిష్ నాన్ వెజ్ మార్కెట్ కు జిల్లా కలెక్టర్,శానసభ్యులు స్థల పరిశీలన చేసి అధికారులతో చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైది రెడ్డి, ఆర్.డి. ఓ జగదీశ్వర్ రెడ్డి,  సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్,  వైస్ ఛైర్మన్ అబ్బగొని రమేష్,నేషనల్ హైవేస్ కల్వకుర్తి ఈ ఈ రాజేందర్,సూర్యా పేట డిప్యూటీ ఈ ఈ ప్రతాప్ రెడ్డి,నల్గొండ ఏ.ఈ ఈ మురళి,మున్సిపల్ డి.ఈ. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణంలో రహదారులు అభివృద్ధి,జంక్షన్ ల ఏర్పాటు,,మీడియన్ లు,ఫుట్ పాత్ లు,సైడ్ డ్రైన్స్,పట్టణ సుందరీకరణ పనులపై మున్సిపల్,ఆర్&బి,రెవెన్యూ,నేషనల్ హై వే అధికారులు ప్రణాళికా బద్దంగా సమన్వయంతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు

Share This Post