నల్గొండ పట్టణం లో రేపు పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు కె.టి.ఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి,జి.జగదీశ్ రెడ్డి*

నల్లగొండ పట్టణ
 అభివృద్ధిలో భాగంగా పురపాలన,పట్టణాభివృద్ధి, పరిశ్రమలు,ఐ.టి.శాఖా మంత్రి కె.టి.ఆర్ రేపు(31.12.2021) శుక్రవారం  నల్లగొండ పట్టణం లో రాష్ట్ర రహదారులు,భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన, ప్రారంభోత్సవ  కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.రేపు శుక్రవారం ఉదయం 10.45 గంటలకు   ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల  ఎస్సి,ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఐటి హబ్ కు శంకుస్థాపన,మధ్యాహ్నం 12.30  బీట్ మార్కెట్ వద్ద వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నల్గొండ పట్టణం లో పర్యటించనున్నారు.ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి ఆయనను పరమర్శిస్తారు. అనంతరం  మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపాలిటీ  అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం లోప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష  సమావేశం లో పాల్గొననున్నారు.

Share This Post