నల్గొండ పట్టణ రహదారులు,జంక్జన్ ల అభివృద్ధి పై మున్సిపల్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*

నల్గొండ పట్టణ అభివృద్ధి లో భాగంగా రహదారులు, జంక్షన్ ల అభివృద్ధి చేసి పట్టణం సుందరీకరణ  కు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తన చాంబర్ లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రీజియనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ నర్సింహ రెడ్డి, నల్గొండ మున్సిపల్ కమిషనర్ రమణా చారి, స్టెమ్,ఎస్.కె.ఎస్ అసోసియేట్ కన్సల్టెన్సీ ల ప్రతినిధులతో,సర్వే,ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్ తో సమావేశం నిర్వహించి పట్టణంలో రోడ్లు,జంక్షన్ లు అభివృద్ధి, ఫుట్ పాత్ లు,మీడియన్ లు,సర్వీస్ రోడ్డు, బస్ బే ఏర్పాటు పై చర్చించారు.మర్రి గూడ అంబేడ్కర్ విగ్రహం నుండి గడియారం సెంటర్ వరకు ప్రసాద్ ఉడిపి హోటల్ వద్ద,ఎన్. టి.ఆర్ విగ్రహం వద్ద, క్లాక్ టవర్ వద్ద,దేవర కొండ రోడ్డు డి.ఈ. ఓ కార్యాలయం,వై.ఎస్.ఆర్.విగ్రహం వద్ద వద్ద, రోడ్డు, మేకల అభినవ్ ఇండోర్ స్టేడియం వద్ద మొదటి దశ లో ఆరు జంక్షన్ లు,మర్రి గుడా నుండి క్లాక్ టవర్ నుండి కలెక్టరేట్,దేవరకొండ రహదారుల అభివృద్ధి,మీడియన్ లు,ఫుట్ పాత్ లు,రహదారి విశాలంగా ఉన్న చోట సర్వీస్ రోడ్డు,బస్ బే లు ఏర్పాటు ఎస్.కె.ఎస్ అసోసియేట్స్, స్టెమ్ కన్సల్ టెంట్ల ద్వారా  చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
నల్గొండ పట్టణ రహదారులు,జంక్జన్ ల అభివృద్ధి పై మున్సిపల్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*

Share This Post