నల్గొండ పట్టణ రోడ్ల విస్తరణ,అభివృద్ధి,సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ,అభివృద్ధి,సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
గురువారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ది,పార్కుల అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులతో కలిసి పరిశీలించారు. చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. పార్కుని ముఖ్యంగా నాలుగు జోన్లుగా ఏర్పాటు చేస్తున్నామని అందులో ముఖ్యంగా పిక్నిక్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, పిల్లల కోసం ప్లే జోన్, ఫోటో జోన్ గా విభజిస్తున్నామని ఆయన అన్నారు. అంతేగాక క్యాంటీన్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, టాయ్ లెట్స్, వాహనాల కోసం పార్కింగ్ మొదలగు సౌకర్యాలు ఉండనున్నట్లు ఆయన వివరించారు. పార్కు మొత్తం నీటి సరఫరా జరిగే విధంగా పైపు లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అదే విధంగా డ్రైనేజీ కాలువ వెంట నిర్మిస్తున్న కాంక్రీట్ గోడను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి నుండి పార్కు వరకు మెయిన్ రోడ్డుకు అనుబంధంగా ఇంటర్ లాకింక్ టైల్స్ అందంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. పార్కులో మొక్కలు నాటేటప్పుడు ఎర్రమట్టి నింపిన తర్వాతనే కొత్త మొక్కలను నాటాలని ఆయన సూచించారు. మర్రిగూడ బైపాస్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు డివైడర్లు పూర్తి అయినందున మొక్కలు నాటడానికి తగు చర్యలు తీసుకుని ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అదే విధంగా స్వామి వివేకానంద విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు డివైడర్ల పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్లను, రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరగాలని ఇంజనీర్లను, కాంట్రాక్టర్లకు తెలిపారు. మర్రిగూడ బైపాస్ నుండి దేవరకొండ రోడ్డు వరకు ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రికల్ టవర్స్ ఏర్పాటు చేశారని, ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రీకల్ టవర్స్, ట్రాన్సుఫార్మర్ల పనులను స్వయంగా పర్యవేక్షించాలని మున్సిపల్ కమీషనర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీర్లు, ఏజెన్సీ వారు రోడ్ల విస్తరణ, ఎలక్ట్రికల్, సుందరీకరణకు సంబంధించి అన్ని రకాల మెటీరియల్స్ ను సిద్దంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమీషనర్, ఏజెన్సీ వారితో జిల్లా కలెక్టర్ చర్చించారు. తర్వాత వి.టి. కాలనీ, ఎల్.వి. పెట్రోల్ బంక్, ఉడిపి హోటల్, తదితర ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్కింగ్ చేసిన ప్రకారం రోడ్ల పనులను నాణ్యతా ప్రమాణాలు స్వయంగా పరిశీలించారు. రిలయన్సు ట్రెండ్సు ఎదురుగా ఉన్న డ్రైనేజీ పనులను వారం రోజులలో పూర్తి చేసి రోడ్డుకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం మరోక సైడు డ్రైనేజీ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. అనంతరం దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ రోడ్డులో ఎలక్ట్రికల్ టవర్లు ఎంత మేరకు ఏర్పాటు చేశారు, ఇంకా ఎన్ని టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ వారం రోజులలో దేవరకొండ రోడ్డు విస్తరణలో భాగంగా ఎలక్ట్రికల్ టవర్ల ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. బీట్ మార్కెట్ లోని మార్కెటింగ్ గోదాము, మార్కెటింగ్ శాఖ ఆధీనంలోని భవన నిర్మాణం ధ్వంసం చేస్తున్న పనులను పరశీలించారు. ప్రకాశం బజార్ లోని మైసయ్య సర్కిల్ లో ఏర్పాటు చేస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ పనులను పరిశీలించారు. అక్కడే చిన్న పార్కు నమూనాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.పార్కులో పబ్లిక్ కోసం సీటింగ్ బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై ప్రగతి నివేదికలు ఈ రోజు సాయింత్రం వరకు తనకు సమర్పించాలని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ఆదేశించారు.

ముందుగా మర్రిగూడ బైపాస్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రజలు మొక్కల సంరక్షణ తమ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రకృతిని మనం సంరక్షించినప్పుడే మానవాళి మనుగడకు మంచి జరుగుతుందన్నార

అందుకే పట్టణంలోని మహిళలు, యువత జన్మదినం, పెళ్లి రోజు లాంటి కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు తమ వంతుగా మొక్కలు సంరక్షించడం కోసం మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ పట్టణ అభివృద్ధి, సుందరీకరణ, రోడ్ల విస్తరణ పనుల పురోగతి పై సంబంధిత శాఖల అధికారులను, ఏజేన్సీలను, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,ఎస్.పి.డి.సి.ఎల్ డి.ఈ విద్యా సాగర్,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, కౌన్సిలర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణ రోడ్ల విస్తరణ,అభివృద్ధి,సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

Share This Post