నల్గొండ,dt 26.9.22. *వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి*

  నల్గొండ,dt 26.9.22.   *వీర నారి చాకలి ఐలమ్మ  గొప్ప పోరాట యోధురాలు: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి*         *ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు*.                       *చాకలి ఐలమ్మ విగ్రహానికి, చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎం.ఎల్.సి.నర్సి రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్*.                            వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధు రాలు అని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  బి.సి.అభివృద్ది సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో   నిర్వహించిన  వీరనారి చాకలి ఐలమ్మ   127 వ జయంతి ని  పురస్కరించుకొని  సోమవారం పట్టణం లోని సాగర్ రోడ్డు లో గల వీర నారి చాకలి ఐలమ్మ  విగ్రహానికి,అనంతరం  జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్ర పటానికి జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి,ఎం.ఎల్. ఏ.కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బ గొని రమేష్ ,బి.సి.సంఘాల నాయకులతో కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనాటి పెత్తందారీ,భూస్వామ్య  వ్యవస్థ పై తిరుగు బాటు చేసిందని,పేద వారిపై జరిగిన అన్యాయాలను న్యాయ పరంగా,చట్ట పరంగా పోరాటం జరిపిన వీర నారి అని అన్నారు.తెలంగాణ మట్టి లోనే పోరాట తత్వ ముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శమని అన్నారు. జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,        ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి,ఎం. ఎల్. ఏ.కంచర్ల భూపాల్ రెడ్డి లు మాట్లాడుతూ 85 సం.ల క్రితం సమాజం లో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనందరికీ స్ఫూర్తిగా,ఆదర్శంగా నిలిచిన గొప్ప మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు.ప్రభుత్వం మహనీయుల జయంతి ని అధికారికంగా జరుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి,బి.సి.అభివృద్ది అధికారి పుష్ప లత,డి.అర్.డి. ఓ. కాళిందిని,షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారిని సల్మా భాను,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,డి.పి.అర్. ఓ శ్రీనివాస్, చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర వైస్ చైర్మన్ కొండూరు సత్యనారాయణ,టి. యన్.జి. ఓ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, బి.సి.సంఘాల నాయకులు చక్ర హారి రామ రాజు,దుడుకుల లక్ష్మి నారాయణ,రజక సంఘాల నాయకులు చిలుక రాజు చెన్నయ్య,చిలుక రాజు సతీష్, లకడా పురం వెంకన్న ఎం.బి.సి.నాయకులు జనార్థన్,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.చాకలి ఐలమ్మ ఉత్సవాల రాష్ట్ర వైస్ చైర్మన్  కొండూ రు సత్యనారాయణ ను ఎం.ఎల్. ఏ కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ లు శాలువా తో సన్మానించారు .
వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి* *ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు*.

Share This Post