నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.

సోమవారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. పార్కు మొత్తం రోలింగ్ చేయాలని, పైపు లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. డ్రైనేజీ కాలువ వెంట నిర్మిస్తున్న కాంక్రీట్ గోడను, ఇతర డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ పనులను పరిశీలించి వచ్చే సోమవారం వరకు మొత్తం మొక్కలు నాటడం, లైటింగ్, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఏజెన్సీ నిర్వాహులను ఆదేశించారు. మర్రిగూడ బైపాస్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు డివైడర్లు పూర్తి కాగా, బైపాస్ నుండి రైల్వే బ్రిడ్జి వరకు మాత్రమే మొక్కలు నాటడం జరిగిందని, డివైడర్లలో స్వామి వివేకనంద విగ్రహాం వరకు మొక్కలు నాటడానికి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. మర్రిగూడ బైపాస్ వద్ద నల్లగొండకు ఎంట్రీ పాయింట్ వద్ద ఐ.టి. హబ్, కలెక్టరేట్, దేవరకొండ, మిర్యాలగూడ ఎంత దూరం ఉంటుందో తెలిపే విధంగా సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని మన్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమీషనర్, ఏజెన్సీ వారితో జిల్లా కలెక్టర్  చర్చించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలక్ర్టిసిటీ సబ్-స్టేషన్ ఎదురుగా డ్రైనేజీ పనులు వేగంగా జరగాలని సంబంధిత ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లను కోరారు.    రిలయన్సు ట్రెండ్సు ఎదురుగా ఉన్న డ్రైనేజీకి స్లాబ్ పూర్తి అయినందున ఇరువైపుల బి.టి. రోడ్డుకు కలిపి అనుసంధానం చేయాలని ఇంజనీర్లకు, అధికారులకు తెలిపారు. మరోక సైడు డ్రైనేజీ పనుల ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు.  బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. బీట్ మార్కెట్ లోని మార్కెటింగ్ గోదాము, మార్కెటింగ్ శాఖ ఆధీనంలోని భవన నిర్మాణం తొలగిస్తున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. జాతీయ రహదారిపై వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం ఏర్పాటు చేయాల్సిన స్వాగత ద్వారం గురించి మున్సిపల్ కమీషనర్ తో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రకాశం బజార్ మైసయ్య సర్కిల్ లో పార్కు, అన్న పూర్ణ క్యాంటీన్ అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.  ఈ రోడ్డులో ఎలక్ట్రికల్ టవర్లు ఎంత మేరకు ఏర్పాటు చేశారు, ఇంకా ఎన్ని టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. సెయింట్ ఆల్ఫెన్సిస్  హైస్కూల్ వద్ద డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసే జంక్షన్ పనులకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.  రోడ్డుకు ఇరవైపుల, మధ్యలో డివైడర్లుగా ఏర్పాటు చేస్తున్న గ్రిల్స్ ను పరిశీలించారు. డివైడర్ల మధ్యలో ఏలాంటి మొక్కలు నాటవచ్చో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.  రోడ్డుకు ఇరువైపుల ఏర్పాటు చేస్తున్న గ్రిల్స్ వెంట కూడా మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని ఇంజనీర్లను కోరారు. మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం మున్సిపాలిటీ వారు పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. కలెక్టరేట్ ప్రక్కన ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ పనులను పరిశీలించి ఇంజనీర్లతో చర్చలు జరిపారు. భూమి లెవెలింగ్ పూర్తి అయిన వెంటనే హెలీప్యాడ్ కు అవసరమైన గ్రౌండు లెవెల్ స్లాబ్ ను పూర్తి చేస్తామని ఇంజనీర్లు వివరించారు. అదే విధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలన్నారు.  డ్రైనేజీ పనులను కలెక్టరేట్ ఎదురుగా గల కల్వర్టు వరకు అంచనాలు రూపొందించాలని ఆయన తెలిపారు.  హెలీప్యాడ్ నుండి కలెక్టరేట్ కు చేరుకోవడానికి  రోడ్డు మార్గంపై సరియైన మార్కింగ్, మ్యాపులు, ప్రతిపాదనలు వెంటనే తనకు సమర్పించాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, ఎస్.పి.డి.సి.ఎల్ డి.ఇ. విద్యాసాగర్, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.

Share This Post