నల్లవేల్లి రైతుల ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.

పత్రిక ప్రకటన
తేది: 6-9-2021
నాగర్ కర్నూల్ జిల్లా.
నల్లవేల్లి రైతుల ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
నల్లవేల్లి ఐ.కె.పి. కొనుగోలు కేంద్రంలో బినామిల పేర్ల పై డబ్బులు జమ అయ్యాయని సంబంధిత బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన రైతులు తమ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టరుకు సమర్పించారు. రైతుల ఫిర్యాదు విన్న కలెక్టర్ సాధ్యమైనంత త్వరగా కేసు పై విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామన్నారు. విచారణ సమయంలో రైతులను సైతం పిలిపించి వాదనలు వింటామని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే కేసును విచారించి రైతులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.
————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారి.

Share This Post