నవంబర్ 1న స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

నవంబర్ 1న స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు , ఈ.అర్. ఓ.లతో ఎస్.ఎస్.ఆర్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్, 30 వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు.

ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలని, ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే ఓటర్ల నుండి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుండి సరిదిద్దే కార్యక్రమం చేపట్టాలన్నారు.

ఓటర్ల అభ్యంతరాలను సవరించి జనవరి5, 2022 న తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా ఆయన సూచించారు.

అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మార్చడం తదితరాలపై ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమోదంతో సిఫారసు చేయవచ్చన్నారు.

పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఓటర్ల మార్పులు, చేర్పులు చేసుకోడానికి గరుడ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ ఎలా ఉపయోగించాలో బి.యల్.ఓ లకు పూర్తి శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు.

ఇ. వి.యం.గోడౌన్ల నిర్మాణం ఇంకా నిర్మాణం పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వీప్ యాక్టివిటిలను నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 6, 6A,7, 8, 8A లకు సంబంధించి 2,934 దరఖాస్తులు అందాయని, 1955 పరిష్కరించడం జరిగిందన్నారు.

నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
ఆర్ డి ఓ నగేష్, ఎన్నికల విభాగం సూపరిండెంట్లు వెంకటేశ్వర్లు, ఉమర్ పాషా, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.

Share This Post