నవంబర్ 15న ఉద్యోగ మేళా …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

నవంబర్ 15న ఉద్యోగ మేళా …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈనెల 15న జిల్లా గ్రామీణ అభివృద్ధిసంస్థ(ఇ.జి.యం.యం) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మెడ్ ప్లస్( Medplus ) కంపెనీలో (50) ఫార్మసిస్ట్/వేర్ హౌస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

పదవ తరగతి పాస్/ ఇంటర్/డిగ్రీ/డి.ఫార్మసి/ బి. ఫార్మసీ/ఎం. ఫార్మసీ విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. 18 నుండి 27 సంవత్సరాల వయస్కులు అర్హులన్నారు. కనీస వేతనం రూ.12 వేల నుండి 15 వేలు ఉంటుందని, మరియు ఇన్సెంటివ్స్ లభిస్తాయని పేర్కొన్నారు.

ఆసక్తి ,అర్హత గల యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లతో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల పాత డిఆర్డిఏ (వెలుగు ఆఫీస్) కార్యాలయంలో నిర్వహించు ఇంటర్వ్యూ లకు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Post