నవంబర్ 23న. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో దేశభక్తి-దేశనిర్మాణంపై ఉపన్యాస(Declamation) పోటీలు : నెహ్రు యువ కేంద్ర, జిల్లా యువ కేంద్ర అధికారి ప్రవీణ్ సింగ్

తేదీ: 16-11-2021
పత్రికా ప్రకటన

దేశభక్తి – దేశనిర్మాణం పై ఉపన్యాస(Declamation) పోటీలు

నెహ్రూ యువ కేంద్రం, నల్లగొండ వారి ఆధ్వర్యంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ (కలిసి ఎదుగుదాము, కలిసి అభివృద్ధి చెందుతాము, కలిసి ప్రయత్నిస్తాము) అనే అంశంపై దేశభక్తి & దేశ నిర్మాణంపై ఉపన్యాస(declamation) పోటీని నిర్వహిస్తున్నట్లు నెహ్రు యువ కేంద్ర జిల్లా యువ అధికారి ప్రవీణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు, 2022 లో భాగంగా జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. యువతి యువకుల వయస్సు 18-29 సంవత్సరాల మధ్య ఉండవలెను. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో పోటీ ఉంటుంది. జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన వారికి 1వ బహుమతి. 5000/-, 2వ బహుమతి. 2000/-, 3వ బహుమతి. 1000/- మరియు విజేతలకు ప్రశంశ పత్రము అందించబడును. తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు. రాష్ట్ర స్థాయి గెలుపొందిన వారిని జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జిల్లా స్థాయి పోటీలు 23 నవంబర్ 2021 , రెడ్ క్రాస్ భవన్ నందు ఉదయం 10:00 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తిగలా యువతి యువకులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. మరిన్ని వివరాల కోసం నెహ్రూ యువ కేంద్ర టీటీడి కళ్యాణ మండపం దగ్గర శివాజీ నగర్ నల్లగొండ లేదా 9052798602 సంప్రదించగలరని కోరారు.

Share This Post