నవంబర్ 3 వరకు వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి కావాలి – కలెక్టర్

బోధన్,రెంజల్ (నిజామాబాద్): నవంబర్ 3 తేదీ వరకు మొదటి డోస్ కోవిడ్ వాక్సిన్ 100% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను సిబ్బందిని ఆదేశించారు.

కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం కందకుర్తి, పేపర్ మిల్., సాటాపూర్., గ్రామాలలో పర్యటించి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 75% వ్యాక్సినేషన్ పూర్తి అయింది అన్నారు. మిగిలిన 25 శాతం నవంబర్ 3వ తేదీలోపు పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్లుతున్నామన్నారు.

18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా వల్ల ఫస్ట్ , సెకండ్ వేవ్ లో ఇబ్బంది పడ్డాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భయంకర పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించడానికి అధికారుల బృందం ప్రత్యేకంగా పని చేస్తున్నదని తెలిపారు. థర్డ్ వేవ్ రావద్దని కోరుకుంటున్నామని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఒకవేళ వస్తే కూడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా ముందుకు సాగుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకుండా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు రావాలని అప్పుడే ఆ ప్రజలు వారి కుటుంబాలు ఈ మహమ్మారి నుండి బయటపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగం హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని అన్నారు.

ఆరోగ్యం బాగా లేకుంటే వ్యాక్సిన్ తీసుకోకూడదని ఒక అపోహ ఉందని, ఆరోగ్యం బాగా లేని వారి కోసమే వ్యాక్సినేషన్ అని, ఆరోగ్యం బాగా లేని వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వారికి కరోనా వస్తే వెంటనే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అన్నారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా వ్యాక్సిన్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మీరు వాడే మందులు యధావిధిగా వాడొచ్చు మీకు అనుమానం ఉంటే మెడికల్ ఆఫీసర్ సలహాలు తీసుకోవాలి అన్నారు.

కోవాక్జిన్ 28 రోజులకు, కొవిషీల్డ్ 8 వారాలకు రెండవ డోసు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండవ డోస్ తప్పక తీసుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించడానికి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ముందుకు రావాలని, వ్యాక్సిన్ 100కు 100% సురక్షితమని జిల్లాలో నిన్నటి వరకు 8 లక్షల పదివేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగలేదన్నారు.
గర్భిణి స్త్రీలు, పాలిచ్చే బాలింతలు, బీపీ, షుగర్, హార్ట్ ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ సిబ్బందికి సహకరించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా ముందుకు సాగాలన్నారు. కందకుర్తి గ్రామం100% వ్యాక్సినేషన్ గ్రామంగా నిలవాలన్నారు. కందకుర్తి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మీ గ్రామాలలో 100% వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు 100% వ్యాక్సినేషన్ తీసుకున్న గ్రామాలకు ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చిన లాక్ డౌన్ అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పని చేస్తుంది అర్థం చేసుకుని 18 సంవత్సరాలు దాటిన వారు కంపల్సరీ తీసుకోవాలన్నారు గ్రామం మోడల్ గ్రామంగా ఉండాలన్నారు అనంతరం పేపర్ మిల్ గ్రామంలో వైకుంఠధామం పరిశీలించారు. ఏర్పాటుచేసిన బెంచీలు నాటిన పూల మొక్కలు ఇతర మొక్కలు చూసి సర్పంచ్ ని అభినందించారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రిస్టియన్, సర్పంచులు మీర్జా అలీ బేగ్ పారుగు పటేల్ bikar భాష తహసిల్దార్ రాంచందర్ ఎంపీడీవో గోపాలకృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post