నవంబర్ 30లోపు సిఎంఆర్ రైస్ డెలవరి పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-2 తేదీ.26.10.2021
నవంబర్ 30లోపు సిఎంఆర్ రైస్ డెలవరి పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, అక్టోబర్,26 :- జిల్లాలో బాయిల్డ్ రైస్ డెలవరి సీఎంఆర్ ను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను, రైస్ మిల్లు ప్రతినిధులను ఆదేశించారు. కస్టం మిల్లింగ్ రైస్, 2020-21 యాసంగి పంట సంబంధిత అంశాల పై సంబంధిత అధికారులతో, రైస్ మిల్లర్లతొ మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం లక్ష్యాలకనుగుణంగా వేగంగా రైస్ అందించేలా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించాలని, యంత్రాలు బ్రెక్ డౌన్ అయితే వెంటనే మరమ్మత్తు చేయించాలని కలెక్టర్ సూచించారు. యాసంగి సీజన్ కి సంబంధించి 5.53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 63 బాయిల్డ్ రైస్ మిల్లులకు అందించామని,సీఎంఆర్ 3.76 లక్షల మెట్రిక్ టన్నుల కు గాను ఇప్పటి వరకు 1.14 మెట్రిక్ టన్నుల రైస్ దించారని, ఇంకా 2.62లక్షల మెట్రిక్ టన్నుల డెలివరి చేయవలసి ఉందని, వీటిని నవంబర్ 30 వరకు ఎఫ్ సి ఐ కి సీఎంఆర్ పూర్తి చేయవలసినదిగా రైస్ మిల్లర్లకు ఆదేశించారు.రైస్ తరలింపుకు స్పేస్ సమస్య మరియు హమాలిల కొరత రాకుండా చూసుకొనగలరని ఏరియా మేనేజర్ ఎఫ్ సి ఐను ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రతి రోజు 24గంటలు మిల్లింగ్ చేసి గడువు సీఎంఆర్ బాయిల్డ్ రైస్ డెలివరి పూర్తి చేయమని కోరినారు. జిల్లాలో ఉన్న ప్రతి రైస్ మిల్లు రోజుకు 3000 మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా ధాన్యం సాగుతుందని, నిబంధనలు రాజీ లేకుండా రైస్ నాణ్యత పై ఎప్పటికప్పుడు పరిశీలించి , ఆమోదించాలని, నాణ్యత పై రాజీ పడవద్దని అదే సమయంలో రైస్ మిల్లులు ఇబ్బందికి గురి చేయవద్దని కలెక్టర్ ఎఫ్.సి.ఐ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ సిబ్బంది, రైస్ మిల్లర్లు, ఎఫ్.సి.ఐ వారు సమన్వయంతో సీఎంఆర్ రైస్ పూర్తి చేయాలని, టీం స్పిరిట్ తో పనిచేయాలని కోరారు. జిల్లాలో రైస్ మిల్లులు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లు అందించే సీఎంఆర్ రైస్ ను భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్లలో స్థలం ఏర్పాటు , హమాలీల కొరత లేకుండా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆర్.డి.ఓ. జగిత్యాల,జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, రైస్ మిల్లర్ అధ్యక్షులు, ఎఫ్.సి.ఐ మేనేజర్,సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీ చేయనైది

Share This Post